Wednesday, July 17, 2013

Attarintikidaredi Film Teaser Net Clicks Records

Attarintikidaredi Film Teaser Net Clicks Records
 

Chiru with sehgal


Childhood Ram charan







పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది’ టీజర్ యూట్యూబ్ రికార్డ్

అత్తారింటికి దారేది’ టీజర్ యూట్యూబ్ రికార్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైంది. తాజాగా విడుదలైన ‘అత్తారింటికి దారేది' టీజర్ యూట్యూబులో రికార్డు స్థాయిలో హిట్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్ కేవలం ఒకటిన్నర రోజులో దాదాపు 5 లక్షల హిట్స్, పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజిలో యూట్యూబులో సంచలనం సృష్టించలేదు. మరో వైపు సినిమా విడుదలకు ముందే భారీ ఎత్తున రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి అన్ని రకాల రైట్స్ ఇప్పటికే రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయాయి. సినిమా విడుదలకు ముందు నిర్మాతకు పెట్టుబడి తిరిగి రావడమే కాదు, భారీ ఎత్తున లాభాలు వచ్చాయట. ఇక సినిమా విడుదలైతే కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ టీజర్ యూట్యూబ్ రికార్డ్ పవన్ కళ్యాణ్ | అత్తారింటికి దారేది పవన్ స్టార్ హీరో కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. పూర్తి వినోదాత్మక ఫ్యామిలీ చిత్రంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ నెల 19న సినిమా విడుదల చేసి, ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.
attharintiki-daaredhi-youtube-record-119517.html

Pawan kalyan rare photos