Wednesday, June 5, 2013

Iddarammayilato collections

ఏపీలో బన్నీ సినిమా 18.52 కోట్లు రాబట్టింది....!


అల్లు అర్జున్ హీరోగా అమలాపాల్ మరియు కేథరిన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' సినిమా మే 31 న విడుదలైనది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించాడు. ఈ చిత్రం కోసం బండ్ల గణేష్ దాదాపు 25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. దాంతో ఈ సినిమా ఏమవుతుందో అని టెన్షన్ పడినట్లు ఇప్పుడు కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా రిసల్ట్ ఏమాత్రం తేడా వచ్చిన నష్టాలు ఎదురవుతాయని అతను కంగారు పడినట్లు అతని సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అంతగొప్ప టాక్ రాకపోయినా వసూళ్ళు మాత్రం రాబడుతుంది. కేవలం రాష్ట్రంలోనే రూ 18.52 కోట్ల రూపాయలు రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ వివరాలు ప్రాంతాల వారిగా ఉన్నాయి.
ప్రాంతం కలెక్షన్
నైజం 6.32 కోట్లు
సీడెడ్ 3.82 కోట్లు
వైజాగ్  2.02 కోట్లు
గుంటూరు 1.92 కోట్లు
ఈస్ట్ 1.32 కోట్లు
వెస్ట్ 1.22 కోట్లు
కృష్ణ 1.11 కోట్లు
నెల్లూరు 0.79 కోట్లు
మొత్తం ఏపీ కలెక్షన్స్ 18.52 కోట్లు
 

No comments:

Post a Comment