చిరంజీవి ప్రమాణం: 'కాకతీయ' నిధులపై తొలి సంతకం
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత చిరంజీవి పర్యాటక శాఖ కేంద్రమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం తొలి సంతకం కాకతీయ ఉత్సవాల నిధులపై చేశారు. కాకతీయ ఉత్సవాలకు రూ.20 లక్షలు మంజూరు చేసే ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడారు.
పర్యాటక శాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖ అన్నారు. భారత దేశం విభిన్న సంస్కృతులకు ప్రత్యేకమైనదన్నారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానన్నారు. కాగా చిరంజీవిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం చిరంజీవిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
No comments:
Post a Comment