Friday, November 9, 2012

రామ్ చరణ్ 'నాయక్‌' బిజినెస్ (ఏరియావైజ్)


రామ్ చరణ్ 'నాయక్‌' బిజినెస్ (ఏరియావైజ్)


హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్ కూడా విడుదల అవకుండానే బిజినెస్ పరంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ లో ప్రచారంలో ఉన్న లెక్కలు ఏరియా వైజ్ గా...
ram charan s nayak business details
సీడెడ్ ...........7.10
నెల్లూర్ ...........1.89
కృష్ణా ...........2.70
గుంటూరు.............ఇంకా ఓపెన్
వైజాగ్ .............. 4.10
వెస్ట్ గోదావరి ............. 2.60
ఈస్ట్ గోదావరి........... 3.06
నైజాం.................ఇంకా ఓపెన్
ఓవర్ సీస్ ....సొంత రిలీజ్
తాజాగా ఈ చిత్రం కర్ణాటక రైట్స్ లో అమ్మకంలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. గాయిత్రి ఫిలిమ్స్ వారు నాలుగు కోట్ల పది లక్షలకు ఈ చిత్రం కర్ణాటక రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికి వరకూ కర్ణాటక ప్రాంతానికి ఆ రేంజిలో ఓ తెలుగు చిత్రం అమ్ముడుపోవటం ఓ రికార్డు. అలాగే అభిరామి ఫిల్మ్స్ వారు ఈ చిత్రం తమిళ రైట్స్ ని రికార్డు ప్రైస్ కి కొనుగోలు చేసారని తెలిస్తోంది.
''నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ఓ యువకుడి కథ ఇది. చరణ్‌ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది. చరణ్‌ నృత్యాలు, అతనిపై చిత్రీకరించిన ఫైట్స్ మాస్‌ని అలరిస్తాయి. 'శుభలేఖ రాసుకొన్నా...' గీతాన్ని రీమిక్స్‌ చేశాం. ఆ పాటలోని లొకేషన్లు అబ్బురపరుస్తాయి. తమన్‌ మంచి బాణీలను అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని దర్శకుడు వివి వినాయిక్ చెప్పారు.

ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము'' అన్నారు.
''సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్‌ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్‌ శైలిలో మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

No comments:

Post a Comment