‘నాయక్’ ప్రీరిలీజ్ బిజినెస్ అదుర్స్
....డిస్టిబ్యూటర్స్ డీటేల్స్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘నాయక్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదరిపోతోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గుంటూరు మినహా అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి రికార్డు స్థాయి రేటు పలికిందని తెలుస్తోంది. అయితే అమౌంట్ ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
డిస్టిబ్యూటర్స్ వివరాల్లోకి వెళితే...
నెల్లూరు ఏరియా రైట్స్ భరత్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. సీడెడ్ ఏరియా రైట్స్ శోభు దక్కించుకున్నారు. కృష్ణ జిల్లా థియేటర్స్ రైట్స్ ను శక్తి ఫిల్మ్స్ వారు కొనుగోలు చేసారు. దాసరి నారాయణకు చెందిన సిరి మీడియా దాదాపు రూ. 10.5 కోట్లు వెచ్చించి నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నారు. అదే విధంగా వి. రావు, చల్ల శంకర్ రావు, తులసి పిల్మ్స్ వారు వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి హక్కులు భారీ రేటుకు సొంతం చేసుకున్నారు.
పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ ‘నాయక్' బిజినెస్ కేక పుట్టిస్తోంది. అభిరామ్ మూవీస్ సంస్థ వారు నాయక్ సినిమా హక్కులను ఆల్ టైం రికార్డ్ రేటుకు దక్కించుకున్నారు. మరో వైపు యూకె-యూరఫ్ రైట్స్ ఎరాబస్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇతర వివరాల్లోకి వెళితే...
‘నాయక్' ఆడియో నవంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోందని, పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరయ్యేలా ఈ ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డివివి దానయ్య నిర్మాత. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.
No comments:
Post a Comment