రామ్ చరణ్ ‘నాయక్’ లేటెస్ట్ అప్డేట్స్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,
టాప్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న‘నాయక్' చిత్రం
చివరి షెడ్యూల్‍కు చేరుకుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫైనల్ షెడ్యూల్
షూటింగ్ మొదలు కానుంది. ఈ ఫైనల్ షెడ్యూల్ లో క్లైమాక్స్ సీన్స్, ఓ సాంగును
చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 18 వరకు షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.
క్రేజీ కాంబినేషన్ కావడంతో ‘నాయక్' సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. విడుదలకు ముందే సినిమా బిజినెస్ కూడా ఎవరూ ఊహించని రీతిలో సాగుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9, 2013న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో డిసెంబర్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా.... అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్ చేయనున్నారు. ''మాస్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్ చెప్పారు.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.

No comments:
Post a Comment