‘కెమెరామెన్ గంగతో రాంబాబు’
సెన్సార్ కట్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఇటీవలే సెన్సార్
కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ దక్కించుకున్న
సంగతి తెలిసిందే. తాజాగా సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చింది.
సెన్సార్ బోర్డు వారు సినిమాలోని కొన్ని అభ్యంతర కర సీన్లు,
డైలాగులకు కత్తెర పెట్టిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
కత్తెరకు గురైన సన్నివేశాలు, డైలాగులు
1. సాంగులో హిప్ (నడుపు భాగం) షేకింగ్ విజువల్స్ బ్లర్ చేయాలి.
2. డైలాగుల్లో వచ్చే ‘అడ్డమైన వాళ్ల ఇంట్లో తినాలి', ‘సంకనాకిన'
అనే పదాలను డిలీట్ చేయాలి.
3. బొడ్డు ఎక్స్ ఫోజింగ్, క్లోజప్‌లో తొడల పై భాగం ఎక్స్ ఫోజింగ్ బ్లర్ చేయాలి.
4. బంధిపోటు, కావాలంటే వాడినే ఉంచుకో, జి పగులుద్ది
అనే పదాలను డిలీట్ చేయడంగానీ, మ్యూట్ చేయడం గానీ చేయాలి
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర విషయానికొస్తే...
‘రాంబాబు నిజాయితీ, ఆవేశం కలిగిన రిపోర్టర్. జనాలకు
చేటు చేకూర్చే ఏ విషయాన్ని సహించడతడు.
పెన్ను బలంతో పాటు కండబలం పుష్కలంగా వున్న
రాంబాబుకు ఓ అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు
ఎదురవుతాడు. దీంతో ఇద్దరి మధ్య పోరాటం ప్రారంభమవుతుంది.
ఈ పోరాటంలో రాష్ట్ర ప్రజానీకాన్ని ఓ పెద్ద సమస్య నుంచి
రాంబాబు రక్షిస్తాడు. ఆ సమస్య ఏమిటనేది
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో చూడాల్సిందే'
అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.
యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య
నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకులముందుకురానుంది.
తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత
చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సెన్సార్ కార్యక్షికమాలు పూర్తయ్యాయి.
య.ఏ.సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ వారు కూడా సినిమా
బాగుందని ప్రశంసించారు.మణిశర్మ సంగీతం శ్రోతల్ని ఆకట్టుకుంటోంది
. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
గేబ్రియల్, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: శ్యామ్.కె.నాయుడు,
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.
No comments:
Post a Comment