Wednesday, October 17, 2012

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫుల్ స్టోరీ...


‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఫుల్ స్టోరీ...


హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజైంది. మూవీ స్టోరీ విషయానికొస్తే....రాంబాబు(పవన్) మెకానిక్. అందరికి మంచి చేసే వ్యక్తి. అన్యాయాలను ఎదురించే దైర్యశాలి. ఇలాంటి వాడు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే కరెక్టర్ అని టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ(తమన్నా) అతనికి జర్నలిస్టు జాబ్ ఇప్పిస్తుంది.
cameraman ganga tho rambabu full story
మాజీ సీఎం జవహర్ నాయుడు(కోట) రాష్ట్రంలో అల్ల కల్లోలం కలిగించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తాను అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంటాడు. అతని కొడుకు రానా నాయుడు(ప్రకాష్ రాజ్) కూడా దుర్మార్గుడే. జవహర్ నాయుడు చేసి అన్యాయాలను, స్కాములను దశరథ్ అనే జర్నలిస్టు బయట పెట్టడానికి ప్రయత్నించడంతో రానా నాయుడు అతన్ని చంపేస్తాడు.
దశరత్ ను చంపింది రానా నాయుడే అనేది బహిరంగ రహస్యమే అయినా అతనికి భయపడి ఎవరూ బయట పెట్టరు. రాంబాబు ధైర్యంగా అతనితో నేరం ఒప్పించి అరెస్టు అయ్యేలా చేస్తాడు. కానీ రాజకీయ నాయకుల అండతో రానా నాయుడు బయటకు వస్తాడు. మీడియా అండతోనే సీఎంని అవుతా అంటూ రాంబాబుకు సవాల్ చేస్తాడు. అనంతరం రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటాడు.
ఈ క్రమంలోనే రాంబాబు, రానా నాయుడు మధ్య వార్ మొదలవుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం రానా నాయుడు....ఇరత రాష్టాల వాళ్లు ఏపీలో ఉండటానికి వీళ్లేదనే ఉద్యమం మొదలు పెడతాడు. పెద్ద ర్యాలీ చేస్తాడు. రాంబాబు రంగంలోకి దిగి జనగనమన గీతం గురించి చెప్పి....భారతీయులంతా ఒక్కటే అని చాటి చెప్పి రానా నాయుడు ఉద్యమాన్ని నీరు కారుస్తాడు.
రాజకీయాల్లో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే దురాలోచనతో చివరకు తన తండ్రితో చివరి ప్రసంగం ఇప్పించి అతన్ని కూడా చంపేస్తాడు రానా నాయుడు. అలా తండ్రి మరణాన్ని తన రాజకీయాలకు ఉపయోగించుకుంటాడు. మరి రాంబాబు రానా నాయుడు దుర్మార్గాలను ఎలా చెక్ పెట్టాడు అనేది క్లైమాక్స్.

No comments:

Post a Comment