Wednesday, October 17, 2012

ప్యూర్ పవన్ షో ('...గంగతో రాంబాబు ' ప్రివ్యూ)


ప్యూర్ పవన్ షో ('...గంగతో రాంబాబు ' ప్రివ్యూ)


హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' ఈ రోజు భారీ ఎత్తున అభిమానులను ఆనందం కలగచేస్తూ విడుదల అవుతోంది. 'గబ్బర్‌సింగ్' తర్వాత కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు హెవీగా ఉన్నాయి. ఆ అంచనాలు అన్నిటినీ మించి ఈ చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్. అలాగే కల్యాణ్‌కీ, నాకూ 'కెమెరామన్ గంగతో రాంబాబు' కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్తున్నారు.
pawan s cameraman gangatho rambabu preview
కథ చూస్తే... ఓ మామూలు కారు మెకానిక్ నుంచి చానల్ రిపోర్టర్‌గా మారిన రాంబాబు కథ. అందరూ చదివి వదిలేసే వార్తల్ని రాంబాబు సీరియస్‌గా తీసుకుని, వాటికి రియాక్ట్ అవుతుంటాడు. గంగ అనే కెమెరా(ఉ)మన్ వల్ల చానల్ రిపోర్టర్ అవుతాడు. ఒక రాజకీయ నాయకునికీ, అతనికీ మధ్య జరిగే గొడవ ఈ సినిమా. మీడియాని వాడుకుని ఆ రాజకీయ నాయకుడు ఎదగాలనుకుంటే, అదే మీడియాని వాడుకొని రాంబాబు అతన్ని ఎలా అడ్డుకున్నాడనేది ఆసక్తికరమైన పాయింట్. అయితే ఇందులో రాజకీయాలు, మీడియా నేపథ్యం ఉన్నప్పటికీ వాటి మధ్య గొడవల జోలికి పోలేదు. ఇది సమకాలీన రాజకీయాల మీద తీసిన సినిమా కాదు.

కథలో, రాంబాబు కేరక్టర్‌లో ఫైర్ ఉంటుంది. ఆ పాత్రలో నిజాయితీ ఉంటుంది. జనాన్ని చైతన్యపరుస్తూ కల్యాణ్ చెప్పే నాలుగు నిమిషాల డైలాగ్ ఉంటుంది. సినిమాలోనే అది బెస్ట్ డైలాగ్. ఇందులో కల్యాణ్, తమన్నా, ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు పాత్రలకు అవార్డులు వస్తాయి. కోట, ప్రకాశ్‌రాజ్ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారు. తమన్నా అంత బాగా చేస్తుందని అనుకోలేదు. అదివరకు ఆమె సినిమాలేవీ చూడలేదు. గంగ పాత్రను చాలా బాగా చేసింది. టామ్‌బాయ్ కేరక్టర్. కల్యాణ్ 'ఏవండీ... మీరు' అని గౌరవంగా పిలిస్తే, ఆమె అతన్ని 'నువ్వు' అని సంబోధిస్తుంటుంది.

No comments:

Post a Comment