Thursday, October 18, 2012

Power star pawan kalyan Power of the rambabu





‘రాంబాబు’ దమ్మెంత?... బౌండరీ దాటే సీనుందా?


హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ ‘గబ్బర్ సింగ్' చిత్రం 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ కలెక్షన్ల విషయంలో పూర్తి స్థాయిలో తన స్టామినా ఏమిటో నిరూపించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
will pawan puri cgtr beat gabbar singh record
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రేపు(అక్టోబర్ 18)న విడుదలకు సిద్ధం అవుతోంది. మరి ఈచిత్రం ‘గబ్బర్ సింగ్' గీసిన బౌండరీ లైన్ దాటుతుందా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై దర్శుకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేక శ్రద్ధపెట్టి రూపొందించాడు. పవన్ కళ్యాణ్ నోట గత సినిమాల్లో ఎందులోనూ లేని విధంగా పవర్ ఫుల్ అండ్ పంచ్ డైలాగులు పలికించబోతున్నాడు పూరి.
గతంలో పవన్-పూరి కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఇటు అభిమానుల్లోనూ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈచిత్రాన్ని భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించి రిలీజ్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్, తమన్నా గ్లామర్, పూరి పంచ్ డైలాగ్స్, మణిశర్మ మాస్ బీట్స్....వెరసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం మరోసారి తెలుగు సినిమా రికార్డులను తిరగడం రాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ప్రకాష్ రాజ్, కోట, అలీ, బ్రహ్మానందం లాంటి క్రేజీ యాక్టర్లు ఉండటం కూడా సినిమా ప్లస్ పాయింట్. ఇప్పటికే విడుదలైన ఆడియో గ్రాండ్ విక్టరీ సాధించడంతో సినిమా సగం విజయాన్ని అందుకున్నట్లే అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ప్రీమియర్ షో రిపోర్ట్ ప్రకారం.... ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్' చిత్రాన్ని మించి మోగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

No comments:

Post a Comment