Wednesday, October 17, 2012

దేశ సరిహద్దులు దాటిన.... పవన్ కళ్యాణ్!

దేశ సరిహద్దులు దాటిన.... పవన్ కళ్యాణ్!


Pawan Kalyan Vacation

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారత దేశ సరిహద్దు దాటారు.
 కొంత కాలం ప్రశాంతంగా షూటింగులకు దూరంగా గడుపుతూ
 హాలీడేస్ ఎంజ్ చేయడానికి యూరఫ్, అమెరికా పర్యటనకు
వెళ్లారు. సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి
బయల్దేరి వెళ్లి పోయారు. మరో నెల రోజుల తర్వాత
 పవన్ హైదరాబాద్‌కు తిరిగి వస్తారని తెలుస్తోంది.
పవన్ చివరి సారిగా ‘తీన్ మార్' చిత్రం షూటింగ్
ముగిసన తర్వాత హాలిడేస్‌కు వెళ్లారు. ఆ సినిమా పెద్దగా
 ఆడక పోవడంతో వృత్తిపై సీరియస్‌గా దృష్టి సారించిన పవన్ పంజా,
గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాల్లో గ్యాప్
 లేకుండా నటించారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఈ నెల 18న గ్రాండ్ గా
 విడుదలవుతోంది. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను
పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా
 పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో
తమన్నా కథానాయికగా నటించింది.
హాలిడే నుంచి తిరిగి వచ్చాక పవన్ కళ్యాణ్.....
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం షూటింగులో
 పాల్గొననున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం
ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక
 చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన
మలయాళ కుట్టి నిత్యా మీనన్ ను హీరోయిన్ గా తీసుకునే
 యోచనలో దర్శకుడు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment