మెగా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ దీపావళి ట్రీట్
హైదరాబాద్ : మెగాభిమానులకు రామ్ చరణ్ ..దీపావళి ట్రీట్ ని అందించనున్నారు. తన తాజా చిత్రం 'నాయక్' టీజర్ ని దీపావళి రోజు (నవంబర్ 13) విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. వినాయిక్ కెరీర్ లో తొలిసారిగా టీజర్ విడుదల చేయటం ఈ చిత్రంతోనే జరుగుతోంది. అలాగే ఈ చిత్రం ఆడియో లాంచ్ నవంబర్ 25 న శిల్ప కళా వేదిక లో భారీ ఎత్తున చేయటానికి ఖరారు చేసారు. చిత్రాన్నిజనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు. 'నాయక్' లో కాజల్, అమలాపాల్ హీరోయిన్స్. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత.''నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ఓ యువకుడి కథ ఇది. చరణ్ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది. చరణ్ నృత్యాలు, అతనిపై చిత్రీకరించిన ఫైట్స్ మాస్‌ని అలరిస్తాయి. 'శుభలేఖ రాసుకొన్నా...' గీతాన్ని రీమిక్స్ చేశాం. ఆ పాటలోని లొకేషన్లు అబ్బురపరుస్తాయి. తమన్ మంచి బాణీలను అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని దర్శకుడు వివి వినాయిక్ చెప్పారు.
''సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్ శైలిలో మాస్, యాక్షన్ అంశాల్ని మేళవించారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు.
ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము'' అన్నారు.
No comments:
Post a Comment